ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోయిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
యువకుడి ఆత్మహత్య
Sep 23 2016 1:20 AM | Updated on Nov 6 2018 8:04 PM
ఆదోని టౌన్: ప్రేమించిన అమ్మాయి తనకు దక్కకుండా పోయిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదోని పట్టణంలోని క్రాంతినగర్‌లో గురువారం చోటుచేసుకుంది. క్రాంతినగర్‌కు చెందిన సుజాత, హుసేని దంపతులు రెండో కుమారుడు మహేష్ బాబు (18) ఓ ప్రై వేటు కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లికి అమ్మాయి బంధువులు నిరాకరించారు. ఈ క్రమంలో మహేష్ పది రోజుల క్రితం అమ్మాయిని కలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్దలు ఇద్దరిని మందలించారు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్‌బాబు తను ప్రేమించిన అమ్మాయి దక్కకుండా పోతుందని మనస్తాపం చెంది బుధవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూ టౌన్ సీఐ గంటా సుబ్బారావు, ఎస్‌ఐ రంగా సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మతుడి తండ్రి హుసేని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement