దైవదర్శనానికి వెళుతూ మరొకరు.. | younger dies of bike accident | Sakshi
Sakshi News home page

దైవదర్శనానికి వెళుతూ మరొకరు..

Sep 17 2017 10:46 PM | Updated on Aug 1 2018 2:10 PM

మండలంలోని ఎంఎం పాళ్యం గ్రామానికి చెందిన రవిచంద్ర (20) తన మిత్రులతో కలిసి బైక్‌లో శనీశ్వరస్వామి దర్శనం కోసం పావగడకు వెళుతుండగా పావగడ సమీపంలో టాటా సుమో వాహనం ఢీకొంది.

అగళి: మండలంలోని ఎంఎం పాళ్యం గ్రామానికి చెందిన రవిచంద్ర (20) తన మిత్రులతో కలిసి బైక్‌లో శనీశ్వరస్వామి దర్శనం కోసం పావగడకు వెళుతుండగా పావగడ సమీపంలో టాటా సుమో వాహనం ఢీకొంది. బైక్‌లోని ముగ్గురికీ గాయాలయ్యాయి. రవిచంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. పావగడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవిచంద్ర స్నేహితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement