ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ మండలంలోని కుంటాల జలపాతంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లా నేరడుగొండ మండలంలోని కుంటాల జలపాతంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఐదుగురు యువకులు ఆదివారం మధ్యాహ్నం కుంటాల జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు. జలపాతం వద్ద వారు సరదాగా గడిపే సమయంలో ప్రమాదవ శాత్తు వినయ్(21) నీటిలో పడిపోయాడు. వెంటనే అతడి కోసం స్నేహితులు, అక్కడి వారు గాలించినా దొరకలేదు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ రాత్రి 7 గంటల దాకా అతడి ఆచూకీ లభ్యం కాలేదు.