ముగిసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జాగరణ దీక్ష | Y. Visweswara Reddy jagarana deeksha completed in beluguppa | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి జాగరణ దీక్ష

May 8 2016 11:35 AM | Updated on May 29 2018 2:33 PM

అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది.

బెళుగుప్ప : అనంతపురం జిల్లా బెళుగుప్పలో శనివారం సాయంత్రం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ప్రారంభించిన జల జాగరణ దీక్ష ఆదివారం ఉదయం ముగిసింది. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరు అందించాలని, జాడిపల్లె గ్రామస్తులకు పునారావాసం కల్పించాలని, జీవో నంబర్ 22ను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఆయన ఈ జాగరణ దీక్ష నిర్వహించారు.

ఇందులో భాగంగా రాత్రంతా నిద్రపోకుండా విశ్వేశ్వరరెడ్డి మేల్కొని ఉన్నారు. పలువురు పార్టీ నాయకులు ఆయన చేపట్టిన జాగరణ దీక్షకు మద్దతు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement