
వరంగల్ జిల్లా పరామర్శ యాత్రకు వైఎస్ షర్మిల
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు.
హైదరాబాద్ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రకు బయల్దేరారు. వైఎస్ఆర్ మరణవార్తను జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను తమ కుటుంబంగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు.
తొలి రోజు ఇలా...
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.