కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కళాశాలలోని ఉమెన్స్ హాస్టల్‌లో విద్యార్థినులు, సిబ్బందికి టెన్నికాయిట్ క్రీడలను ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు.
కేఎంసీలో మహిళా క్రీడలు ప్రారంభం
May 6 2017 12:45 AM | Updated on Sep 5 2017 10:28 AM
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం కళాశాలలోని ఉమెన్స్ హాస్టల్‌లో విద్యార్థినులు, సిబ్బందికి టెన్నికాయిట్ క్రీడలను ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, వార్డెన్ డాక్టర్ స్వర్ణలత, డిప్యూటీ వార్డెన్ డాక్టర్ మాధవీశ్యామల, వైద్యులు ఎస్. లక్ష్మి, ఎ. పద్మవిజయశ్రీ, రేవతి, ఫిజికల్ డైరెక్టర్ రామకృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement