నైటీతో భార్యను హతమార్చిన భర్త | Woman Killed By Husband | Sakshi
Sakshi News home page

నైటీతో భార్యను హతమార్చిన భర్త

Apr 22 2016 12:24 AM | Updated on Sep 3 2017 10:26 PM

నైటీతో భార్యను హతమార్చిన భర్త

నైటీతో భార్యను హతమార్చిన భర్త

నువ్వే ప్రాణమన్నాడు.. ఊపిరిగా ఉంటానన్నాడు.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు.

కాకినాడ రూరల్ : నువ్వే ప్రాణమన్నాడు.. ఊపిరిగా ఉంటానన్నాడు.. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అనుమాన భూతం ఆవహించడంతో అతడికి కన్నూమిన్నూ ఆనలేదు. ఆమెను ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. నైటీతో భార్య గొంతు నులిమి హతమార్చిన భర్త ఉదంతం కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో గురువారం చోటుచేసుకుంది.
 
 సర్పవరం సీఐ మురళీకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.ముక్తేశ్వరం గ్రామానికి చెందిన కార్పెంటర్ కొప్పాడ సత్తిబాబు, పూజలక్ష్మి ఐదేళ్లు క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకలలో కాపురం ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రవర్తనపై సత్తిబాబు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భార్యపై చేయి కూడా చేసుకునేవాడు.
 
  కార్పెంటర్ పని కోసం బయటకు వెళ్లొచ్చిన వెంటనే భార్యతో గొడవలు పడుతుండడంతో, పలుమార్లు పెద్దల దృష్టికి వివాదం వెళ్లేది. భార్యాభర్తల మధ్య సఖ్యత కుదిర్చి, కాపురానికి పంపేవారు. ఇలాఉండగా బుధవారం అర్ధరాత్రి భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన సత్తిబాబు తన భార్య మెడకు నైటీని బిగించి, ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement