అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు | Woman injured in the fire accident | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదంలో మహిళకు గాయాలు

Jul 21 2016 4:46 PM | Updated on Sep 5 2018 9:47 PM

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ మహిళ ఒంటికి నిప్పంటుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ ఓ మహిళ ఒంటికి నిప్పంటుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మహారాష్ట్రకు చెందిన చెందిన సునిత(20) భర్త పేరు పరమేశ్వర్ గత కొన్నేళ్ల క్రితం తుకారాంగేట్‌లో నివాసముంటున్నారు. సునిత గృహిణి. అయితే, బుధవారం రాత్రి సమయంలో ఇంటి పక్కనే ఉండే ఆమె అక్క సబిత ఇంటికి వెళ్లింది. అక్కడ వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే సునీతను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. 20 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement