పాముకాటుకు మహిళ బలి | woman dies of snake byte | Sakshi
Sakshi News home page

పాముకాటుకు మహిళ బలి

Jul 7 2017 10:43 PM | Updated on Oct 22 2018 2:22 PM

పొలంలో పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు బలైంది.

హిందూపురం రూరల్‌ : పొలంలో పని చేసుకుంటున్న మహిళ పాముకాటుకు బలైంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఎం.బీరేపల్లికి చెందిన సుగుణమ్మ (28) భర్త నరసింహులు, అక్క శారదతో కలిసి శుక్రవారం తమ తోటలో చెట్ల నుంచి వంకాయలు తొలగిస్తోంది. చెట్టుమొదలులో ఉన్న పామును గమనించకుండా సుగుణమ్మ కాలుమోపగానే ఆమె బొటనవేలిపై కాటువేసింది. వెంటనే ఆమె భర్త, అక్కకు తెలిపి కిందపడిపోయింది. హుటాహుటిన ఆమెను పొలంలోంచి గట్టుపైకి తీసుకొచ్చి 108కు సమాచారమందించారు. కేసులు ఎక్కువగా ఉన్నందున రావడం ఆలస్యం అవుతుందని తెలపడంతో ఆటోలో  హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రూరల్‌ ఏఎస్‌ఐ వెంకటరాముడు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement