రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | woman dies of road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Mar 2 2017 10:40 PM | Updated on Aug 30 2018 4:10 PM

మండలంలోని సప్తగిరి క్యాంపర్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.

శింగనమల : మండలంలోని సప్తగిరి క్యాంపర్‌ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఎస్‌ఐ హమీద్‌ఖాన్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన కొండమ్మ(50)  కొడుకు(వరుసకు)తో కలిసి దిచక్రవాహనంపై అనంతపురం ఆస్పత్రికి వెళుతోంది. ద్విచక్ర వాహనం సప్తగిరి క్యాంపర్‌ వద్ద ఉన్న బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక వస్తున్న కారు ఢీకొంది.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న కొండమ్మ కింద పడింది. కొండమ్మకు తీవ్ర గాయాలవడంతో 108లో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement