రైలు ఢీ కొని మహిళ మృతి | woman dead in train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీ కొని మహిళ మృతి

Aug 29 2016 11:13 PM | Updated on Sep 4 2017 11:26 AM

పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని రైలు ఢీ కొట్టి నేదునూరి సుగుణ (52) అనే మహిళ మరణించింది.

 పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం గుర్తు తెలియని రైలు ఢీ కొట్టి నేదునూరి సుగుణ (52) అనే మహిళ మరణించింది. రామగుండం రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ దివాకర్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన సుగుణ పెద్దపల్లి మండలం మారెడుగొండ గ్రామంలో తన సోదరి ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తోంది. భాగ్యనగర్‌ రైలులో పెద్దపల్లికి చేరిన ఆమె కూనారం వెళ్లే బస్సు ఎక్కాలనే ఆదుర్దాతో పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి భర్త మల్లయ్య, కుమారులు శ్రీకాంత్, శ్రీధర్, కూతురు పద్మ ఉన్నారు. 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement