పిల్లలతో దొంగతనాలు చేయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
పిల్లలతో దొంగతనాలు చేయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 16 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాల నేరస్తులను చేరదీసి వారితో దొంగతనాలు చేయిస్తున్న మహిళను పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.