నీటి సంరక్షణ అందరి బాధ్యత | water saving is our Responsibility | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణ అందరి బాధ్యత

Mar 25 2017 10:16 PM | Updated on Mar 21 2019 8:35 PM

నీటి సంరక్షణ అందరి బాధ్యత - Sakshi

నీటి సంరక్షణ అందరి బాధ్యత

నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ కోరారు.

సుండుపల్లి: నీటిని సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ కోరారు. సుండుపల్లిలో శనివారం రాజంపేట ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి నీటిపథకం ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో నీరుచెట్టు కింద రూ.500కోట్ల వివిధరకాల పనులు, 2వేల చెక్‌డ్యాంకుల, 3500 ఇతర పనులు మంజూరుచేశామన్నారు. చిన్నచిన్న కుంటలు 60వేలు తవ్వామన్నారు.

వర్షం వస్తే కుంటలు, వాగులు, చెరువుల్లో నీరు చేరితే నీటికష్టాలు తీరతాయన్నారు. ఎస్‌.డి.టి. కింద రూ.200కోట్లు జిల్లాకు మంజూరైతే రూ.180కోట్లు మంచినీటికే వినియోగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సంజీవరావు, ఏఎస్‌ఈ అనుగురాజన్, తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీఓ సుధాకర్‌రెడ్డి, దేశంనాయకులు రాజకుమార్‌రాజు, శివరామిరెడ్డి, మహేశ్వరరాజు, సీఐ నరసింహరాజు, ఎస్‌ఐ చలపతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement