అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల | water relese into alaganur reservoir | Sakshi
Sakshi News home page

అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదల

Dec 14 2016 10:21 PM | Updated on Sep 4 2017 10:44 PM

రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు

రిజర్వాయర్‌లోకి వస్తున్న నీరు

అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ రామ్మూర్తి తెలిపారు.

మిడుతూరు: అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ రామ్మూర్తి తెలిపారు. బుధవారం అలగనూరు రిజర్వాయర్‌లోకి నీటి విడుదలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీ కెనాల్‌ లాకెన్స్‌లో నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్‌ 2.965 సామర్థ్యం ఉండగా,  ప్రస్తుతం 2.41 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈ సెల్వరాజ్‌ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement