చంద్రబాబుపై విశ్వేశ్వర్రెడ్డి ఫైర్ | vishweshwar reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై విశ్వేశ్వర్రెడ్డి ఫైర్

Mar 25 2016 11:15 AM | Updated on Jul 28 2018 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి శుక్రవారం అనంతపురంలో మండిపడ్డారు.

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి శుక్రవారం అనంతపురంలో మండిపడ్డారు. చంద్రబాబు పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. రాజధాని భూ కుంభకోణంలో సాక్షి మీడియా ప్రతినిధులను బెదిరించడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని విమర్శించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా చంద్రబాబు రుణమాఫీ అమలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాలన్న ధ్యాస చంద్రబాబుకు లేదని విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement