బెజవాడ బంద్ : నేతల హౌస్ అరెస్ట్ | vijayawada bandh due to temples Removing | Sakshi
Sakshi News home page

బెజవాడ బంద్ : నేతల హౌస్ అరెస్ట్

Jun 29 2016 10:41 AM | Updated on Aug 10 2018 9:42 PM

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటిని కాపాడటం కోసం గోశాలను తొలగిస్తున్నారంటూ ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది.

విజయవాడ: అభివృద్ధి పేరుతో ఆలయాల కూల్చివేతకు వ్యతిరేకంగా అఖిలపక్షం నేతృత్వంలో బుధవారం విజయవాడ నగరబంద్ కొనసాగుతుంది. పోలీసులు ముందస్తుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇంటిని కాపాడటం కోసం గోశాలను తొలగిస్తున్నారంటూ ధర్మ పరిరక్షణ సమితి ఆరోపించింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత గోశాలను భారీ యంత్రాలతో అధికారులు తొలగించారు. దీనిని ప్రశ్నించిన గోశాల నిర్వహాకులపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కచ్చితంగా తొలగిస్తాం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు నగరంలో 44 ఆలయాలను ధ్వంసం చేశారు. తాజాగా కెనాల్‌రోడ్డులోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ తొలగింపునకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పాలక వర్గంపై ఒత్తిడి తెస్తున్నారు. ఆలయాల తొలగించడంపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement