
తొలుత తిరస్కరించిన హోం శాఖ జాయింట్ సెక్రటరీ
అయినా పెరోల్ కావాల్సిందేనని పట్టుపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు
శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో హోం మంత్రికి డీల్ కుదిర్చిన వైనం
డీల్ ఓకే కావడంతో స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం చేసిన అనిత
తప్పని పరిస్థితిలో పెరోల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హోం సెక్రటరీ
ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక
సాక్షి, అమరావతి: తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న అలివేలి శ్రీకాంత్‌కు నిబంధనలకు విరుద్ధంగా పెరోల్ మంజూరు చేయించడం వెనుక రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమేయం ఉందని తేటతెల్లమైంది. అంతటి తీవ్రమైన నేరాల్లో శిక్ష పడిన అతనికి పెరోల్ మంజూరు చేయడం సాధ్యం కాదని హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ స్పష్టంగా తిరస్కరించినా, హోం మంత్రి అనిత ఒత్తిడితోనే పెరోల్ మంజూరైందని స్పష్టమైంది.
శ్రీకాంత్ పెరోల్ ప్రతిపాదనను జూలై 16నే హోం శాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్ తిరస్కరించడం గమనార్హం. దీంతో మంత్రి బుకాయింపు బెడిసికొట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవిత ఖైదీ అలివేలి శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు కోసం నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పాశం సునీల్‌కుమార్‌లు హోంశాఖ జాయింట్ సెక్రటరీ కేవీ కిషోర్ కుమార్‌కు సిఫార్సు చేశారు.
ఆ మేరకు వారిద్దరూ సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు. కానీ.. తీవ్రమైన నేరాలకు పాల్పడి జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తుండటంతోపాటు గతంలో ఒకసారి జైలు నుంచి పరారైన శ్రీకాంత్‌కు పెరోల్ ఇవ్వకూడదని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు నివేదిక సమరి్పంచారు. దాంతో శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేయాలన్న ప్రతిపాదనను కిషోర్ కుమార్ తిరస్కరించారు. ఈ మేరకు అధికారికంగానే జూలై 16న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుపట్టి మరోమారు హోం మంత్రి అనితపై ఒత్తిడి తెచ్చారు.

ఈ క్రమంలో శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణతో మంత్రికిడీల్ కుదిర్చారు. డీల్ ఓకే కావడంతో శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేయాలని ఆదేశిస్తూ హోం మంత్రి అనిత స్వయంగా నోట్‌ఫైల్‌పై సంతకం పెట్టారు. ఈ నేపథ్యంలో ఆ ఫైల్ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ వద్దకు వెళ్లింది. హోం మంత్రి ఒత్తిడితో తప్పనిసరి పరిస్థితిలో కుమార్ విశ్వజిత్ అనివార్యంగా శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జూలై 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ వర్గాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాయి.
