రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు.. | vigilance officers rides on rice mills | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ దాడులు..

Jun 10 2017 3:10 PM | Updated on Sep 5 2017 1:17 PM

జిల్లాలో రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు.

► భారీగా ధాన్యం పట్టివేత

ఖమ్మం జిల్లా : జిల్లాలో రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన వేలాది బస్తాల ధాన్యం, బియ్యంను సీజ్‌ చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురంలో ప్రసాద్ మోడ్రన్ రైస్ మిల్ పై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక దాడులు జరిపారు. సుమారు 6 వేల బస్తాల ధాన్యం, 278 క్వింటాల బియ్యం, 16 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మిల్లింగ్‌ ఆపేసి మిల్లుకు మూతవేశారు.

Advertisement
 
Advertisement
Advertisement