విజయోత్సాహం!
పీఎస్‌ఎల్‌వీసీ–37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి.
– ర్యాలీలు నిర్వహించిన విద్యార్థులు
– జాతీయజెండాతో ప్రదర్శన పాఠశాలలు
– ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పీఎస్‌ఎల్‌వీసీ–37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. రష్యా రికార్డును బద్దలు కొడుతూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ 104 ఉపగ్రహాలతో నింగి కెగసింది. ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు స్వీట్లు పంచారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండా ప్రదర్శనతో ఆనందం వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్‌వీ సీ37 విజయవంతంతో ప్రపంచంలో భారత నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోవడం ఎంతో గర్వకారణమని మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ విజయం దేశాభివృద్ధిలో ఎంతో కీలకం కానున్నదని వ్యాఖ్యానించారు.