మళ్లీ మొదలైన వేయికాళ్ల మండపం వివాదం | 'Veyi Kalla Mandapam' to be rebuilt on Tirumala | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదలైన వేయికాళ్ల మండపం వివాదం

Mar 11 2016 10:37 AM | Updated on Sep 3 2017 7:30 PM

వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదలైంది.

తిరుమల : వేయికాళ్ల మండపం వివాదం మళ్లీ మొదలైంది. శ్రీవారి ఆలయం ఎదుటే వేయికాళ్ల మండపం నిర్మించాలంటూ గతంలోనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా నారాయణగిరి ఉద్యానవనంలో రూ. 18 కోట్ల వ్యయంతో వేయికాళ్ల మండపం నిర్మాణానికి టీటీడీ సిద్ధమైంది.  కాగా ఈ నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. టీటీడీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కిషోర్ స్వామి, లక్ష్మణానాథాచార్యలు హైకోర్టును ఆశ్రయించారు.  శ్రీవారి ఆలయం ఎదురుగానే ఈ మండపం పునఃనిర్మాణం జరిగేలా టీటీడీని ఆదేశించాలంటూ వారు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టే విధించింది. 2003లో తొలగించిన వేయికాళ్ల మండలం టీటీడీ తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement