బసివిని, దేవదాసీలను ఆదుకోవాలి | Uphold must Devadasis | Sakshi
Sakshi News home page

బసివిని, దేవదాసీలను ఆదుకోవాలి

Dec 20 2016 10:53 PM | Updated on Sep 15 2018 2:43 PM

బసివినీ, దేవదాసీలు, మాతంగుల సంక్షేమానికి పాటు పడాలని ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప డిమాండ్ చేశారు.

  • ఎస్సీ సంక్షేమ సంఘం డిమాండ్‌
  • అనంతపురం న్యూటౌన్‌ : బసివినీ, దేవదాసీలు, మాతంగుల సంక్షేమానికి పాటు పడాలని  ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కుళ్లాయప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొందరి కారణంగా జీవితం కోల్పోయిన బసివినిలుగా, దేవదాసీలు మారిన  వారి సంక్షేమం కోసం బడ్జెట్‌ రూ.100 కోట్లు కేటాయించాలని, వయస్సుతో నిమిత్తం లేకుండా పింఛన్‌ సౌకర్యం కల్పించాలని, వీరి పిల్లలకు ఉచిత విద్యనందించాలని  డిమాండు చేశారు. కార్యక్రమంలో నరసింహులు, నారాయణ, బాబు, బంగారు రాము, ప్రకాష్, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement