ప్రాణం మీదికి తెచ్చిన ఉద్యోగ ‘పరీక్ష’ | unemployed died in Substation operator tests | Sakshi
Sakshi News home page

ప్రాణం మీదికి తెచ్చిన ఉద్యోగ ‘పరీక్ష’

Aug 16 2016 2:04 AM | Updated on Sep 4 2017 9:24 AM

సబ్‌స్టేషన్ ఆపరేటర్ల కోసం నిర్వహించిన పరీక్షలు ఓ నిరుద్యోగి ప్రాణాల మీదకు వచ్చారుు.

విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు
జారిపడిన అభ్యర్థి.. తీవ్ర గాయాలు

 జోగిపేట: సబ్‌స్టేషన్  ఆపరేటర్ల కోసం నిర్వహించిన పరీక్షలు ఓ నిరుద్యోగి ప్రాణాల మీదకు వచ్చారుు. నారాయణఖేడ్ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లలో పనిచేసేందుకు సోమవారం అందోలు మండలం అల్మారుుపేట సబ్‌స్టేషన్ లో అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.  దాదాపు 30 మందిలో నారాయణఖేడ్‌కి చెందిన పుండరీకం.. పరీక్షల్లో భాగంగా విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు పట్టుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో నడుముకు తీవ్ర గాయాలయ్యారుు. బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుుతే, విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగిన వారినే సెలెక్ట్ చేయాలని ఎస్‌ఈ ఆదేశించారని జోగిపేట ట్రాన్ ్సకో డీఈ శ్రీనివాస్, ఏడీ నాగరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement