ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | Two red sandalwood smugglers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Dec 20 2015 1:40 PM | Updated on Oct 22 2018 1:59 PM

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో బెజ్జూరువారిపల్లె వద్ద ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో బెజ్జూరువారిపల్లె వద్ద ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున వాహన తనిఖీల సందర్భంగా ఇన్నోవా వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న విషయం బయటపడింది. ఇన్నోవా వాహనంతోపాటు అందులోని పది ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షేక్‌లాల్‌బాషా, ఇరగంరెడ్డి నాగదస్తగిరిరెడ్డిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పూజిత వెల్లడించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement