బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు | Two missing at Manginapudi Beach | Sakshi
Sakshi News home page

బీచ్‌లో ఇద్దరు యువకుల గల్లంతు

May 1 2016 12:55 PM | Updated on Sep 3 2017 11:12 PM

మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి బీచ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు.

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : మచిలీపట్నం మండల పరిధిలోని మంగినపూడి బీచ్‌లో స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గుడివాడ పట్టణానికి చెందిన ఆరుగురు యువకులు బీచ్‌కు వెళ్లగా.. అందరూ సాగర జలాల్లోకి దిగారు. వీరిలో ఇద్దరు గల్లంతు కాగా, నలుగురిని మత్స్యకారులు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. వారు అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement