వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడింది.
ఒంగోలు : వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ముండ్లమూరు గ్రామానికి చెందిన రైతు లింగం వెంకటేశ్వరరెడ్డి వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబసభ్యులతో కలసి ట్రాక్టర్‌పై బావి వద్దకు వెళ్తుండగా.. గ్రామ శివారులోని వాగు వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడింది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. వాగుపై కల్వర్టు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. స్థానికులు ఆరోపిస్తున్నారు.