రెండు గుడిసెలు దగ్ధం | two hurts burnt in patugattupalli | Sakshi
Sakshi News home page

రెండు గుడిసెలు దగ్ధం

Feb 5 2017 11:19 PM | Updated on Aug 25 2018 5:39 PM

ముదిగుబ్బ మండలం పాయగట్టుపల్లిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి.

ముదిగుబ్బ (ధర్మవరం) : ముదిగుబ్బ మండలం పాయగట్టుపల్లిలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గుడిసెలు దగ్ధమయ్యాయి. ఓ బాలిక ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకునేఽ ప్రయత్నంలో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. కదిరి నుంచి అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఆర్‌ఐ పవన్‌కుమార్, వీఆర్‌ఓ గ్రామానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. బాలిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement