రామాయంపేట శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు మృతి చెందారు.
రామాయంపేట శివారులో రామాయంపేట - సిద్ధిపేట రహదారిపై గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు రైతులను ఓ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బైరం లక్ష్మయ్య(55), గావు లింగం(60) అనే ఇద్దరు రైతులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా..మార్గమధ్యంలో మృతిచెందారు.