వికారాబాద్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత | Two factions quarlled in young gilr matter | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత

Oct 21 2015 10:38 PM | Updated on Aug 25 2018 5:33 PM

వికారాబాద్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత - Sakshi

వికారాబాద్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత

వికారాబాద్ మండలకేంద్రంలోని ఆలంపల్లిలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

వికారాబాద్(రంగారెడ్డి): వికారాబాద్ మండలకేంద్రంలోని ఆలంపల్లిలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. రెండు వర్గాల ప్రజలు తోసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

ఏ క్షణాన ఏం జరుగుతుందోనని స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రేపు దసరా పండుగ కూడా కావడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయంలో కొన్ని రోజుల క్రితం కూడా గొడవ జరిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement