మండల పరిధిలోని చలిమిల్ల గ్రామంలో పొలాల్లో గురువారం రాత్రి జరిగిన విద్యుదాఘాతం ఇద్దరిని బలి తీసుకుంది.
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
Jan 5 2017 11:54 PM | Updated on Sep 5 2018 2:26 PM
పాములపాడు: మండల పరిధిలోని చలిమిల్ల గ్రామంలో పొలాల్లో గురువారం రాత్రి జరిగిన విద్యుదాఘాతం ఇద్దరిని బలి తీసుకుంది. గ్రామానికి చెందిన బుజ్జన్న, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు యానాదుల రాజు(20), దర్గయ్య కుమారుడు డేగల నారాయణ(28) ఉదయం పొలానికి వెళ్లి ప్రమాదం బారిన పడ్డారు. ఘటనా స్థలంలో శరీరం పూర్తిగా కాలిపోయి ఉండటంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడంలో భాగంగా ఏర్పాటుచేసిన తీగల వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని గ్రామస్తులు పేర్కొంటున్నారు. మృతుడు నారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement


