నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లాలో ఆదివారం వెలుగుచూసింది
	సైదాపూర్(కరీంనగర్): నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జగీర్‌పల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అన్నె రాజు(25)కు శుక్రవారం వివాహం అయింది.
	
	ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
