ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి | TTDP MLA Revanth Reddy and Sandra Venkata Veeraiah met Telangana Assembly Speaker | Sakshi
Sakshi News home page

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి

Dec 16 2016 3:03 AM | Updated on Sep 4 2017 10:48 PM

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయండి

టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20లోగా చర్యలు తీసుకోవాలని టీటీడీపీ నేతలు ఎ.రేవంత్‌రెడ్డి,

స్పీకర్‌ను కలసిన రేవంత్, సండ్ర
సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారిపై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 20లోగా చర్యలు తీసుకోవాలని టీటీడీపీ నేతలు ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. గురువారం ఈ మేరకు శాసనసభ స్పీకర్‌ను కలసి అసెంబ్లీలో వినతి పత్రాన్ని అందించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలను తీసుకోకుండానే టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా గతంలో ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించినట్లు గుర్తు చేశారు. ప్రశ్నల సంఖ్యను, సభలో మాట్లాడే సమ యాన్ని కూడా టీడీపీకి ఉన్న 15 మంది ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారమే ఇవ్వాలని రేవంత్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement