Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తాం’ | Threat emails target Delhi Assembly and Metro station | Sakshi
Sakshi News home page

Delhi : ‘అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తాం’

Mar 24 2026 11:16 AM | Updated on Mar 24 2026 11:46 AM

Threat emails target Delhi Assembly and Metro station

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ స్పీకర్‌ విజేందర్‌ గుప్తకు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన విజేందర్‌ గుప్తా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.  పోలీసులు, బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. డాగ్‌ స్క్వాడ్‌తో అణువణువూ గాలిస్తున్నారు. 

బాంబు బెదిరింపులు తొలిసారి మంగళవారం ఉదయం 7.28గంటల సమయంలో అసెంబ్లీ అధికారిక మెయిల్స్‌కు వచ్చింది. 21 నిమిషాల వ్యవధిలో సరిగ్గా ఉదయం 7.49 గంటలకు అసెంబ్లీ స్పీకర్‌కు మరో మెయిల్‌ వచ్చింది. ఖలిస్తానీ వేర్పాటు వాదుల పేరిట వచ్చినట్లు అనుమానిస్తున్న ఆ ఈమెయిల్స్‌లో మధ్యాహ్నం 1.11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ, సాయంత్రం 9.11గంటలకు ఢిల్లీ మెట్రో స్టేషన్‌ను బాంబులతో పేల్చివేస్తామని పేర్కొన్నట్లు సమాచారం. ఢిల్లీ అసెంబ్లీ,మెట్రో స్టేషన్‌తో పాటు అగంతకులు ప్రస్తావించిన ఇతర ప్రాంతాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు  

 

Advertisement
 
Advertisement
Advertisement