
రాజీవ్‌కు నివాళి
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
సోమాజిగూడ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతిని పురస్కరించుకుని శనివారం సోమాజిగూడలోని ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. రాష్ట కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, మండలి విపక్ష నత షబ్బీర్ అలీ, ఎంపీ హనుమంతరావు, మాజీ మంత్రి దానం, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, బండ కార్తీకరెడ్డి తదితరులు పాల్గొన్నారు.