చెట్టుకు పుట్టిన రోజు | Tree birthday celebrations | Sakshi
Sakshi News home page

చెట్టుకు పుట్టిన రోజు

Aug 2 2016 11:06 PM | Updated on Mar 28 2018 11:26 AM

చెట్టుకు పుట్టిన రోజు - Sakshi

చెట్టుకు పుట్టిన రోజు

గత ఏడాది ఇదే రోజు నాటిన మొక్కకు అధికారులు, విద్యార్థులు కేక్‌ కట్‌చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించారు. మేడ్చల్‌లోని న్యూ లిటిల్‌ లిల్లి హైస్కూల్‌లో గత ఏడాది ఇదే రోజు నిర్వహించిన హరితహారంలో స్థానిక తహశీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని ఓ మొక్క నాటారు.

 మేడ్చల్‌: గత ఏడాది ఇదే రోజు నాటిన మొక్కకు అధికారులు, విద్యార్థులు కేక్‌ కట్‌చేసి పుట్టినరోజు వేడుక నిర్వహించారు.  మేడ్చల్‌లోని న్యూ లిటిల్‌ లిల్లి హైస్కూల్‌లో గత ఏడాది ఇదే రోజు నిర్వహించిన హరితహారంలో స్థానిక తహశీల్దార్‌ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొని ఓ మొక్క నాటారు. అది ఏపుగా పెరిగింది. దీంతో మంగళవారం స్కూల్‌ యాజమాన్యం ఆహ్వానం మేరకు తహశీల్దార్‌, సీఐ రాజశేఖర్‌రెడ్డి, నగరపంచాయతీ కమిషనర్‌ రాంరెడ్డిలు స్కూల్‌కు వెళ్లి విద్యార్థుల సమక్షంలో ఆనాటి మొక్క వద్ద కేక్‌ కట్‌చేసి పుట్టినరోజు వేడుక చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ మంజులప్రకాష్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు హరితహారం సందర్భంగా కిష్టాపూర్‌ రోడ్డులో ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement