వాడవాడలా హరితహారం | tree, area, cheruvu | Sakshi
Sakshi News home page

వాడవాడలా హరితహారం

Jul 28 2016 12:07 AM | Updated on Sep 4 2017 6:35 AM

హరితహారం కార్యక్రమంలో భాగంగా మండంలోని హాజీపూర్, దొనబండ జీపీల్లో బుధవారం విస్తృతంగా మొక్కలు నాటారు. మండలంలోని హాజీపూర్‌ జీపీ పరిధిలోని ధర్మారం, దొనబండ గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. వాడవాడలా హరితహారం నిర్వహించారు.

  •  ఎమ్మెల్యే దివాకర్‌రావు
  • మంచిర్యాల రూరల్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా మండంలోని హాజీపూర్, దొనబండ జీపీల్లో బుధవారం విస్తృతంగా మొక్కలు నాటారు. మండలంలోని హాజీపూర్‌ జీపీ పరిధిలోని ధర్మారం, దొనబండ గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మొక్కలు నాటారు. వాడవాడలా హరితహారం నిర్వహించారు.
               ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వాతావరణ కాలుష్యం నివారణకు, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే వన సంపందను విరివిగా పెంచాలని కోరారు. భవిష్యత్‌లో రైతాంగానికి సాగునీరు కూడా అందాలంటే మొక్కల పెంపకంలో పొలం, చెరువు గట్లపై  మొక్కలు నాటేలా చైతన్యం కావాలని కోరారు.
                ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ బేర సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, హాజీపూర్, దొనబండ సర్పంచులు ఆకుతోట సత్తమ్మ, జాడి సత్యం, ఉప సర్పంచులు బెడ్డల సత్తయ్య, దొమ్మాటి లచ్చన్న, ఎంపీటీసీలు బేతు రమాదేవి, మడావి సంధ్యారాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దొమ్మాటి సత్తయ్య, నాయకులు మాధవరపు రాజేశ్వర్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ కొట్టె సత్తయ్య పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement