ఉచ్చులో చిక్కిన ఎలుగు బంటి మృతి | traped bear died | Sakshi
Sakshi News home page

ఉచ్చులో చిక్కిన ఎలుగు బంటి మృతి

Feb 12 2017 10:03 PM | Updated on Sep 5 2017 3:33 AM

ఆత్మకూరు అటవీ డివిజన్‌ బైర్లూటీ రేంజ్‌ పీఏపురం నార్త్‌బీట్‌లోని గోగుల గుండం వద్ద శనివారం వేటగాళ్ల ఉచ్చు నుంచి క్షేమంగా బయట పడిన ఎలుగు బంటి ఆదివారం మరణించింది.

రామయ్యకుంట బేస్‌క్యాంప్‌(ఆత్మకూరురూరల్‌): ఆత్మకూరు అటవీ డివిజన్‌ బైర్లూటీ రేంజ్‌ పీఏపురం నార్త్‌బీట్‌లోని గోగుల గుండం వద్ద శనివారం వేటగాళ్ల ఉచ్చు నుంచి క్షేమంగా బయట పడిన ఎలుగు బంటి  ఆదివారం మరణించింది. అటవీ అధికారులు ఉచ్చు నుంచి తప్పించిన ఎలుగుబంటిని రామయ్య బేస్‌క్యాంప్‌నకు తరలించారు. అక్కడే దానికి చికిత్స చేశారు. రాత్రంతా పర్యవేక్షిస్తూ ఆహారాన్ని అందించారు. కాగా షాక్‌కు గురైన ఎలుగుబంటి తేరుకోలేక మృతి చెందింది. ఏసీఎఫ్‌ సాయిబాబా, బైర్లూటీ రేంజర్‌ శంకరయ్య పర్యవేక్షణలో బేస్‌ క్యాంప్‌లోనే పోస్టుమార్టం నిర్వహించి, కళేబరాన్ని దహనం చేశారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement