డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా ఈనెల 2న నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు.
రేపు వైఎస్‌ఆర్ వర్ధంతి
Aug 31 2016 11:38 PM | Updated on Jul 7 2018 3:19 PM
కర్నూలు(ఓల్డ్‌సిటీ): డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 7వ వర్ధంతి జిల్లా వ్యాప్తంగా ఈనెల 2న నిర్వహించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తామన్నారు. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండలాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. కర్నూలులోని కష్ణకాంత్ ప్లాజాలో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 10 గంటలకు వైఎస్ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్ కాంస్య విగ్రహం వద్ద నివాళులర్పిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
Advertisement


