మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ | Toilet objectives must be completed: jc | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్ల లక్ష్యాలను పూర్తి చేయాలి:జేసీ

Jul 28 2016 11:19 PM | Updated on Mar 19 2019 7:01 PM

స్మార్ట్‌ సర్వే, మరుగుదొడ్లతో పాటు రెవెన్యూ శాఖలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిరే్ధశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అ«ధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం ఆదేశించారు.

అనంతపురం అర్బన్‌: స్మార్ట్‌ సర్వే, మరుగుదొడ్లతో పాటు రెవెన్యూ శాఖలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిరే్ధశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అ«ధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రజాసాధికార సర్వే, రెవెన్యూ, పౌర సరఫరాల అంశాలపై ఆర్‌డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లతో టెలీకాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మండంలోనూ రెండు గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్ధాలన్నారు.  అధికారుల కృషి కారణంగా  సివిల్‌ సప్లై మేనేజ్‌మెంట్‌లోనూ, బెస్ట్‌ ఫింగర్‌ డిటెక్షన్‌ (బీఎఫ్‌డీ)లోనూ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని చెబుతూ అభినందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement