నేడు హోంమంత్రి చిన్నరాజప్ప పర్యటన | today home minister tour | Sakshi
Sakshi News home page

నేడు హోంమంత్రి చిన్నరాజప్ప పర్యటన

Apr 21 2017 11:19 PM | Updated on Sep 5 2017 9:20 AM

హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప శనివారం జిల్లాలో పర్యటించనున్నాడు.

– ఆధునికీకరించిన జిల్లా జైలుకు ప్రారంభోత్సవం
– భారీ బందోబస్తు ఏర్పాటు
 
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప శనివారం జిల్లాలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు చేరుకొని పంచలింగాల సమీపంలో ఆధునికీకరించిన జిల్లా జైలును ప్రారంభిస్తారు. అనంతరం 12 గంటలకు జిల్లా పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారు. భోజనం అంతరం 2.30 గంటలకు నందికొట్కూరు చేరుకొని అక్కడ పోలీసు క్వార్టర్స్‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2.45 గంటలకు నందవరం వెళ్లి స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 3.45 గంటలకు నంద్యాలకు వెళ్తారు. అక్కడ సాయంత్రం 5 గంటలకు కాపు కల్యాణ మండపానికి భూమి పూజతో పాటు పోలీసు కార్టర్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 7 గంటలకు నంద్యాల నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.. 
 

Advertisement
 
Advertisement
Advertisement