స్కాలర్‌షిప్‌లను పెంచాలి | To increase the Scholarship | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌లను పెంచాలి

Sep 16 2016 8:04 PM | Updated on Sep 4 2017 1:45 PM

స్కాలర్‌షిప్‌లను పెంచాలి

స్కాలర్‌షిప్‌లను పెంచాలి

మిర్యాలగూడ అర్బన్‌ : పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముల్లం రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మిర్యాలగూడ అర్బన్‌ : పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముల్లం రమేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పట్టణంలోని సమతడిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాలు తమ ఇష్టానుసారం పెంచుకున్న నాయకులు విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌ షిప్‌లు పెంచడంలో వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ముడావత్‌ రవినాయక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఖమ్మంపాటి శంకర్, శివ, శ్రీకాంత్, సైదులు, సత్యనారాయణ, సతీష్, ఏఐఎస్‌ఎఫ్, టీఎన్‌ఎస్‌ఎఫ్, బీసీ సంఘాల నాయకులు పరంగిరాము, మచ్చ సైదులు, తిరుమలగిరి అశోక్, కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకులు పరశురాములు కళాశాల ప్రిన్సిపల్‌ చీదళ్ల రమేష్, రామారావు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement