విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలి | to do arrest principal | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై దాడి చేసిన ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలి

Jul 27 2016 12:12 AM | Updated on Aug 20 2018 4:27 PM

విద్యార్థులపై దాడి చేసిన హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

సూర్యాపేట : విద్యార్థులపై దాడి చేసిన హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాల ప్రిన్సిపాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అధిక ఫీజుల నియంత్రణ కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్‌ నిర్వహించారని, ఇందులో భాగంగానే హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిని కళాశాలకు వెళ్లారని, ఇంతలోనే కళాశాలలో ఉన్న ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి వచ్చి విద్యార్థి సంఘం నాయకులపై దుర్భాషలాడి దాడి చేయడం హేయమైన చర్యన్నారు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement