ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరికి బదులు మరొకరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
గుంటూరు: ఇంటర్ విద్యార్థిని తిరుపతమ్మ ఆత్మహత్య కేసులో పోలీసులు ఒకరికి బదులు మరొకరిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకే పేరు ఉండటంతో పొరపాటు జరిగిందని పోలీసులు దిద్దుబాటు చర్యలకు దిగారు. తోటి విద్యార్థుల వేధింపులు తాళలేక కృష్ణవేణి ఇంటర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తిరుపతమ్మ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గత ఆదివారం తిరుపతమ్మ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు చేసుకుంది.


