యువకుడి వేధింపులు భరించలేక యువతి తీవ్ర నిర్ణయం.. | Hanumakonda Woman Incident And Harassment Case Telangana | Sakshi
Sakshi News home page

యువకుడి వేధింపులు భరించలేక యువతి తీవ్ర నిర్ణయం..

Oct 24 2026 8:01 AM | Updated on Oct 24 2026 8:30 AM

Hanumakonda Woman Incident And Harassment Case Telangana

హన్మకొండ: ప్రేమ పేరుతో యువ కుడి వేధింపులు భరించ లేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ముస్త్యాల పల్లిలో శుక్రవారం చోటుచేసు కుంది. ఎస్సై ఇమ్మడి వీరభద్ర రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట స్నేహ (22) పీజీ పూర్తిచేసి కొంతకాలంగా ఇంటివద్ద ఉంటుంది.

ఇదే గ్రామానికి చెందిన జీడిమెట్ల శ్రీధర్‌ కొంతకాలంగా ఆ యువతిని ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. తనను పెళ్లిచేసుకోవాలని, లేని పక్షంలో తనతో వాట్సాప్‌లో చేసిన చాటింగ్‌ బంధువులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విష యం యువతి తన తల్లిదండ్రులకు తెలపగా శ్రీధర్‌ను పెద్దమనుషుల సమక్షంలో మందలించారు. అయిన ప్పటికి మరో నంబర్‌ నుంచి ఫోన్‌ చేస్తూ తననే పెళ్లి చేసుకోవాలని, లేని పక్షంలో చంపుతానని బెదిరించాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంటి సమీపంలోని బావిలోదూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనస్థలానికి చేరుకొని, మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమనిక: మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001; మెయిల్: roshnihelp@gmail.com

ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణ యువతి మృతి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement