నీలాద్రిపేటలో పేలుడు : ముగ్గురికి తీవ్రగాయాలు | Three injured in firework manufacturer house | Sakshi
Sakshi News home page

నీలాద్రిపేటలో పేలుడు : ముగ్గురికి తీవ్రగాయాలు

Oct 30 2015 9:46 AM | Updated on Sep 13 2018 5:25 PM

తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేటలో శుక్రవారం బాణాసంచా తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది.

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిపేటలో శుక్రవారం బాణాసంచా తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం...గ్రామానికి చెందిన శీలం సత్తిబాబు ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా అనుకోకుండా పేలుడు జరిగింది.

ఈ ఘటనలో సత్తిబాబు, అతని భార్య అశ్విని, సోదరుడు ప్రసాద్ గాయపడ్డారు. పేలుడుతో ఇల్లు పూర్తిగా దెబ్బతింది. సత్తిబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇన్వర్టర్ పేలటం వల్లే తామంతా గాయపడ్డామని బాధితులు చెబుతున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement