రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి | Three dies in two lorry collision in khammam | Sakshi
Sakshi News home page

రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి

Feb 4 2017 8:51 AM | Updated on Aug 30 2018 4:10 PM

రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి - Sakshi

రెండు లారీలు ఢీ.. ముగ్గురు మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సత్తుపల్లి(ఖమ్మం):
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మెడిశేట్టివారిపాలెం క్రాస్‌ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కరీంనగర్‌ నుంచి కాకినాడకు గ్రానైట్‌ రాళ్లతో వెళ్తున్న లారీ అశ్వరావుపేట నుంచి సత్తుపల్లి వైపు బియ్యం లోడ్‌తో వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కరీంనగర్‌జిల్లాకు చెందిన ఇద్దరితో పాటు మరో వ్యక్తి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టానికి, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement