ఇసుక అక్రమ రవాణా... ముగ్గురి అరెస్ట్ | three arrested and lorry seized in sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణా... ముగ్గురి అరెస్ట్

Feb 7 2016 7:35 AM | Updated on Aug 28 2018 8:41 PM

గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

కొవ్వూరు(పశ్చిమగోదావరి): గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని ముగ్గురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇసుక తరలించడానికి ఉపయోగించిన బోటును వదిలేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement