మానవతకు పాతరేసిన వారిపై కేసులు | Their cases to the human | Sakshi
Sakshi News home page

మానవతకు పాతరేసిన వారిపై కేసులు

Mar 16 2017 2:35 AM | Updated on Sep 15 2018 8:43 PM

మానవతకు పాతరేసిన వారిపై కేసులు - Sakshi

మానవతకు పాతరేసిన వారిపై కేసులు

నెలలు నిండకుండానే పుట్టిన పాపానికి మూడురోజుల పసికందుకు మరణ శిక్ష వేయాలనుకున్న వారిపై

పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నెలలు నిండకుండానే పుట్టిన పాపానికి మూడురోజుల పసికందుకు మరణ శిక్ష వేయాలనుకున్న వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రాణాలతోనే శిశువును పాతిపెట్టేందుకు ప్రయత్నించిన ఉదంతం సంచలనం సృష్టించింది. సాక్షిలో ‘మానవతకు పాతర’ శీర్షికతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో  పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు  ఎంవీపీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మళ్ల మహేశ్‌ బుధవారం తెలిపారు. శిశువును పూడ్చి పెట్టడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు లక్ష్మణ్, శిశువు తండ్రి రాంబాబులతోపాటు కృష్ణా క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement