రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ | theft in keesara Registrar Office | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్ ఆఫీసులో చోరీ

Jun 23 2016 7:08 PM | Updated on Mar 28 2018 11:26 AM

కీసర రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం చోరీ జరిగింది.

కీసర(రంగారెడ్డి జిల్లా): కీసర రిజిస్ట్రార్ ఆఫీసులో గురువారం చోరీ జరిగింది. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు వచ్చిన దంపతుల వద్ద నుంచి దుండగులు చాకచక్యంగా నగదు దొంగిలించారు. నాగారం గ్రామానికి చెందిన సంతోష్, లక్ష్మి అనే ఇద్దరు దంపతులు గురువారం ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు కీసర రిజిస్ట్రార్ కార్యాలయానికి రూ.1.57 లక్షలు తీసుకొచ్చారు.

దస్తావేజులకు రూ. 44 వేలు చెల్లించారు. మిగతా సొమ్మును బ్యాగులో ఉంచారు. బ్యాగు జిప్పు సరిగా వేయకుండానే రిజిస్ట్రార్ ఆఫీసులో వేరొక ప్రభుత్వ ఉద్యోగితో మాట్లాడుతున్నారు. ఇది గమనించిన గుర్తుతెలియని దుండగులు అందులోని రూ.73 వేల నగదు తస్కరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ గురువారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement