గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలోని అంకమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలోని అంకమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. ఆలయ గర్భగుడి తలుపులు పగులగొట్టిన గుర్తు తెలియని దుండగులు అమ్మవారి వెండి కిరీటం, రెండు బంగారు గొలుసులు, మంగళ సూత్రాలు ఎత్తుకుపోయారు. అక్కడే ఉన్న హుండీని పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకుపోయారు. ఈ మేరకు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సొత్తు విలువ కనీసం రూ.2 లక్షలు ఉంటుందని పూజారి తెలిపారు.