ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం | The resurrection of public schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం

Sep 10 2016 12:20 AM | Updated on Sep 4 2017 12:49 PM

ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం తీసుకురావడానికి మన ఊరు– మనబడి కార్యక్రమంతో ఉద్యమంగా పని చేస్తున్నామని స్థాని క ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు.

  • ∙ఎమ్మెల్యే అరూరి రమేష్‌ 
  • వర్ధన్నపేట : ప్రభుత్వ స్కూళ్లకు పునరుజ్జీవం తీసుకురావడానికి మన ఊరు– మనబడి కార్యక్రమంతో ఉద్యమంగా పని చేస్తున్నామని స్థాని క ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. మండలంలోని ల్యాబర్తిలో జరిగిన గురుపూజోత్సవం కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘బడి మనదే..బాధ్యత మనదే’ కార్యక్రమంతో నియోజవకర్గంలోని ప్రతి పాఠశాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేశామని తెలిపారు. దా తల సహకారంతో నిధులు సమకూర్చి అభివృద్ధి కా ర్యక్రమాలు చేశామని వెల్లడించారు. మన గురువులను మనం గౌరవించుకోవాలని విద్యార్థుల్లో స్ఫూర్తినికల్పించడానికి గురువులకు ఆత్మీయ సన్మానం చేస్తున్నట్లు వివరించారు. నియోజకవర్గంలోని పాఠశాలల్లోని 1550 ఉపాధ్యాయుల కు, విద్యావలంటీర్లకు ఒకే రోజున సన్మాన కార్యక్రమం చేసినట్లు వెల్లడించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నా యకులను భాగస్వామ్యం చేశామన్నారు. ఎంపీ పీ మార్నెని రవీం దర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, తహసీల్ధార్‌ కనకయ్య, ఎంపీడీఓ ఎం. శ్రీనివాసరావు, సీఐ ఆదినారాయణ, ఎస్సై ఉపేందర్, సర్పంచ్‌ తక్కళ్లపెల్లి విజయ, ఎంపీటీసీ సభ్యుడు భూక్య శ్రీనివాస్, ఎస్‌ఎంసీ చైర్మ న్, విద్యాభివృద్ధి కమటీ సభ్యులు  పాల్గొన్నారు.  
    నాలుగు మండలాల్లో హాజరైన ఎమ్మెల్యే...
    గురువుల ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి నియోజకవర్గంలోని మడికొండ, కొండపర్తి, ల్యాబర్తి, పర్వతగిరి, హసన్‌పర్తి జెడ్పీఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అరూరి రమేష్‌ హాజరయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement